Thursday , May 23 2024

స్పందన అనాధాశ్రమంలో బట్టలు నిత్యవసర సరుకులు పంపిణి…

జమ్మికుంట మార్చి 03: తెలంగాణ కెరీటం

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి స్పందన అనాధ ఆశ్రమంలో ఆదివారం (costco) కాస్ట్ కో కంపెనీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనాధ పిల్లలకు బట్టలు,150 కిలోల బియ్యం,20కిలోల నూనె పండ్లు పంపిణి తో పాటు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్బంగా కాస్ట్ కో కంపెనీ కరీంనగర్ ఇంచార్జి ధర్మారపు రాజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.రానున్న రోజుల్లో ఇలాంటి సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుగులోత్ దేవా, శ్రీనివాస్, నాగరాజు, సంపత్, లక్ష్మి, వెంకటేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.