Monday , September 16 2024

ఎరుకల కులస్థులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి…

*తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు కేమసారం తిరుపతి డిమాండ్…

జమ్మికుంట రూరల్ మార్చి 03: తెలంగాణ కెరటం

ఆదివారం రోజున జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జమ్మికుంట మండల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు కెమసారం తిరుపతి హాజరయ్యారు.వారు మాట్లాడుతూ తెలంగాణలో నివసిస్తున్న ఎరుకల కులస్తులకు రాజకీయ అవకాశాలు కల్పించాలని అన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న పేద బడుగు బలహీన వర్గ ఎరుకల ప్రజలకు ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఎరుకల కులస్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎరుకల కులస్తులు 8 లక్షల జనాభా కలిగి ఉన్న ఎరుకల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న నిరుద్యోగ యువతీ యువకుల కోసం ప్రత్యేక స్వయం ఉపాధి పథకాలను ఏర్పాటు చేయాలని వారు పేర్కొన్నారు. పందులను శాస్త్రీయ పద్ధతిలో పెంచే విధంగా ప్రభుత్వమే వారికి శిక్షణ ఇచ్చి స్థలాలు ఇవ్వాలని వారు తెలియజేశారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా రుణాలు ఇవ్వాలని వారు తెలిపారు .ఎరుకల కుటుంబానికి రూ 5 లక్షల రుణాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశo అనంతరం జమ్మికుంట నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షునిగా పల్లకొండ సమ్మయ్య మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా కుర్ర ఎల్ల స్వామి మండల ప్రధాన కార్యదర్శిగా పల్లకొండ అశోక్ జిల్లా ఉపాధ్యక్షుడిగా దుగ్యాల రాజయ్య లోకిని అజయ్ కుర్ర తిరుపతి సహాయ కార్యదర్శిగా పల్లకొండ వీరయ్య ఉండాడి రవి కుర్ర బాపురావు దుగ్యాల రవి వారిని ఏకగ్రీవ ఎన్నిక చేసి తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు కేమసారం తిరుపతి వారికి నియామక పత్రాలు అందజేశారు. వీరితో పాటు తెలంగాణ ఎరుకల ప్రజా సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు తిరుపతి సంపత్ తదితరులు పాల్గొన్నారు.