Tuesday , July 16 2024

ఎండ తీవ్రత తట్టుకోలేక మతిస్థిమితం లేని వ్యక్తి మృతి…

జమ్మికుంట మే 5; తెలంగాణ కెరటం ప్రతినిధి

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి ఆదర్శ కాలనీలో మూడేడ్ల రాజయ్య(50)అనే మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇల్లందకుంట మండలంలోని చిన్నకోమటిపల్లి గ్రామానికి చెందిన మూడేళ్ల రాజయ్య ఆరోగ్యం బాగాలేక మతి స్థిమితం కోల్పోయి ఊరూరా తిరుగుకుంటూ భిక్షాటన చేసుకుంటూ ప్లాస్టిక్ బాటిల్ ఎరుకుంటూ జీవించేవాడని గత వారం రోజుల నుండి ఇంటి దగ్గర నుండి వెళ్ళిపోయి ఆదివారం కొత్తపల్లిలో ఆదర్శ కాలనీలో గల రైల్వే ట్రాక్ పక్కన ఎండ తీవ్రతకు చనిపోయి పడి ఉన్నాడఅని తన తమ్ముడు మూడెడ్ల ఆచయ్య కు తన అన్న కొడుకు శేషు తెలుపగా జమ్మికుంటలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చూడగా డాక్టర్ చనిపోయినాడని చెప్పినాడని వారు దరఖాస్తు ఇవ్వగా జమ్మికుంట సీఐ వరగంటి రవి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.