Wednesday , September 18 2024

ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో ముందు సాగాలి….

*టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షులు
అంబాల ప్రభాకర్ (ప్రభు)…

జమ్మికుంట ఫిబ్రవరి 25: తెలంగాణ కెరటం

శనివారం రాత్రి 8:30 గంటలకు తన వ్యక్తిగత పనులపై కరీంనగర్ వెళ్లి పనులు పూర్తి చేసుకొని తిరిగి వస్తుండగా జమ్మికుంట ఇంటికి వస్తుండగా
రంగాపూర్ బస్టాండ్ సమీపంలో చెల్పూర్ గ్రామానికి చెందిన కాసిడి మల్లారెడ్డి అనే వ్యక్తి ద్విచ్రవాహనం అతి వేగంగా ప్రక్కన వెళ్తున్న వాహనాల్ని ఓవర్ టేక్ చేస్తూ వెళ్తుండగా గుర్తు తెలియని ద్విచక్రవాహనంకు డీ కొని అక్కడికక్కడే పడి తలకు తీవ్ర గాయం అయి రక్త స్రావం అవుతుంటే గమనించిన టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఆoబాల ప్రభాకర్
వెంటనే తన కార్ లో నుండి దిగి రోడ్డు మధ్యలో పడి ఉండి తలకు తీవ్ర రక్త స్రావం అవుతున్న వ్యక్తిని రోడ్డు ప్రక్కకు ఎత్తుకెళ్లి పడుకోబెట్టారు.
లేకుంటే వెనుక నుండి వేగంగా వస్తున్న ఇతర వాహనాలు అతనిపై దూసుకెల్లేవని తెలిపారు.
అదే విధంగా వారి కుటుంబ సభ్యులకు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలియజేసి,
జమ్మికుంటకు చెందిన తన మిత్రులకు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుపగా వారు వెంటనే 108 వాహనానికి ఫోన్ చేయగా 108 వాహనం చేరుకుని ఘటన స్థలం నుండి ప్రమాదానికి గురైన వ్యక్తిని దగ్గరుండి చికిత్స కోసం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి పంపించి మానవత్వాన్ని చాటున్నారు.కాసిడి మల్లారెడ్డి త్వరగా కోలుకోవాలని ఆయన కోరారు.