Tuesday , July 16 2024

మత సామరస్యానికి ప్రతీక ముస్లిం వనిత అభేత భాను,,

తెలంగాణ కెరటం మార్చి 25

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో గల చేయూత్ ఫౌండేషన్ (ఎన్. జి. ఓ) గల సభ్యురాలు అయిన అభేదాభాను మరియు ఇతర సభ్యులకు సౌత్ రీజియన్ రాష్ట్రాల తరఫున మన జమ్మికుంట మహిళా అయిన అబేదాబాను కు జాతీయస్థాయి అవార్డు రావడం చాలా సంతోషకరంగా ఉందని కరీంనగర్ జిల్లా ప్రజలు ఒక ముస్లిం వనిత అయిన అభేదా భాను కరోనా సమయంలో ప్రజలకు మాస్కు మరియు ఇతర మహిళా ఉపాధి కల్పనలకు ఉచిత కుట్టుమిషన్లు మరియు ఎన్నో సహాయ కార్యక్రమాలు ఆమె అందించడం,
ఈ సంస్థ ద్వారా ఆమె యొక్క పట్టుదల కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు.
జమ్మికుంట పట్టణంలో ఈరోజు హోలీ పండుగ సందర్భంగా హోలీ రంగులు సిఎస్ఎఫ్ ఆర్మీ దళాలకు సమర్పించడం ఆమె యొక్క ఉదారత తెలియజేస్తుంది.
ఒక మహిళ అయినా ధైర్యంగా దీటుగా సవాళ్లను ఎదుర్కొంటూ ఈ స్వచ్ఛంద సంస్థ ముందుకు పోవడంలో ఆమె యొక్క పట్టుదల కృషి ప్రశంసనీయం.
ఇటువంటి మహిళకు మనం చేయూతనిచ్చుకుంటూ ఇటువంటి వారిని ప్రోత్సహించడం మన యొక్క బాధ్యత అని ప్రజలు అనుకోవడం చాలా ఆనందదాయకం అనుకోవాలి.
ముస్లిం అనిత అయిన అన్నిటినీ ఈ యొక్క సంస్థకు ఒక పట్టుకొమ్మలాగా ఉండి ఊరి పేరు జాతీయస్థాయినందు తీసుకువచ్చినందులకు గాను ప్రజలు ఆమెను ఆశీర్వదించారు ఇటువంటి కార్యక్రమాలు ఆమె ముందు ఉండి మన దేశ పేరు నిలబెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.