జమ్మికుంట మార్చి 14: తెలంగాణ కెరటం
జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో గురువారం హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెపు సారంగపాణి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ ,బలహీన వర్గాలను గుర్తించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,భట్టి విక్రమార్క,దుద్ధిళ్ళ శ్రీదర్ బాబు,పొన్నం ప్రభాకర్ లకు జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కసబోజుల వెంకన్న, పూదరి రేణుక శివకుమార్ గౌడ్, సుంకరి రమేష్, ఎగ్గని శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండి సజ్జు, ఎండి ఇమ్రాన్, ప్రశాంత్ (సన్నీ)దొడ్డె నవీన్, మంద అశోక్ ,సూర్య, రవి, సురేష్ బండి మల్లయ్య, పాపిరెడ్డి, సాంబయ్య, శ్యాంసుందర్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.