Wednesday , July 24 2024

కార్పొరేషన్లతో సామాజిక న్యాయం…

*జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోలుగూరి సదయ్య…

జమ్మికుంట మార్చి 14: తెలంగాణ కెరటం

సీఎం రేవంత్ రెడ్డి వారి మంత్రి మండలి సర్కార్ కార్పొరేషన్ల‌ ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రములో సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టిందని జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోలుగూరి సదయ్య పేర్కొన్నారు. కార్పొరేషన్లతో కులాల వారీగా న్యాయం చేకూరుతుందన్నారు. వెనకబడిన వర్గాలకు పెద్దపీట వేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం హామీ ఇచ్చి మర్చిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రస్తుత ప్రభుత్వం చెప్పిన, చెప్పని హామీలను సైతం అమలు చేస్తోందన్నారు.ఈ ప్రభుత్వానికి‌ ప్రజల‌ ఆశీస్సులున్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో‌ మెజార్టీ స్థానాల్లో గెలుస్తామన్నారు.