జమ్మికుంట మార్చి 14: తెలంగాణ కెరటం
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డులో గల హౌసింగ్ బోర్డ్ కాలనీ చెందిన స్వతంత్ర సమరయోధురాలు వెనిశెట్టి వెంకటలక్ష్మి (95) గురువారం ఉదయం మృతి చెందారు. ఆరవ వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ గౌడ్ మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.