Tuesday , July 16 2024

బాధితులకు పిఎంకె ఫౌండేషన్ ఉదారత…

జమ్మికుంట రూరల్ మార్చి 14: తెలంగాణ కెరటం

పిఎంకె ఫౌండేషన్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామానికి చెందిన దాసరి బిక్షపతికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దీంతో అతనికి డయాలసిస్ చేయాల్సిన అవసరం ఏర్పడింది.విషయం తెలుసుకున్న (పల్లె మొగిలయ్య కనకమ్మ జ్ఞాపకార్థం తల్లి దండ్రుల పేరు మీద) పీఎంకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ కిడ్నీ వ్యాధిగ్రస్తుడైన దాసరి బిక్షపతి కుటుంబానికి నెలకు రూ 2500/- చొప్పున సహాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం రోజున పిఎంకె ఫౌండేషన్ నిర్వాహకుల ద్వారా బిక్షపతి నివాసంలో కుటుంబానికి 2500 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పిఎంకె ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా అనారోగ్యంతో బాధపడే కుటుంబాలకు తాను అండగా ఆసరాగా నిలబడతానని తెలిపారు. ముందు ముందు మరిన్ని ఫౌండేషన్ తరపున సామాజిక సేవ కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడి ఉండి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించుకోలేనీ స్థితిలో ఉన్న కుటుంబాలకు అదేవిధంగా వైద్యం చేయించుకోలేని కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తానని తెలిపారు. ఇలాంటి సమస్యలు ఉంటే ఫౌండేషన్ నిర్వాహకులకు సమాచారం ఇవ్వాలని పల్లె ప్రభాకర్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో పల్లె రవి గౌడ్ గండి రంజిత్ కుమార్ గౌడ్ కడవెరుగు సంపత్ డాక్టర్ గోపి బండారి శ్రీనివాస్ యాదవ్ తాటిగంటి వీరస్వామి కారుపాకల వెంకన్న గొడుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.