Thursday , May 23 2024

గల్ఫ్ కార్మికులను మోసం చేసిన ధర్మపురి అరవింద్

కోరుట్లలో గల్ఫ్ భరోసా ఆత్మీయ సమ్మేళనం

అరవింద్ పై గల్ఫ్ ఖల్లివెల్లి చార్జిషీట్ పత్రాలు విడుదల

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, మే, 04 : కోరుట్ల పట్టణంలోని గజం హోటల్లో శనివారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, సిఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత చెన్నమనేని శ్రీనివాస రావు అధ్యక్షతన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ గల్ఫ్ భరోసా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్య అతిథులుగా బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్తిని అనిల్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు పాల్గోన్నారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ 2019 లో మాయ మాటలతో గల్ఫ్ కార్మికుల ఓట్లు కొల్లగొట్టి నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అరవింద్ గల్ఫ్ కార్మికును మోసం చేశాడని ఆరోపించారు. టీపీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కాంగ్రెస్ విభాగం ఆధ్వర్యంలో “గల్ఫ్ కార్మిక ద్రోహి… గప్పాల అరవింద్” పేరిట చార్జిషీట్ ను విడుదల చేశారు. చార్జిషీట్ ప్రతులను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, మాజీ ఎమ్మెల్యే ఈరవత్తిని అనిల్ ఇతర నాయకులతో కలిసి అరవింద్ పై గల్ఫ్ ఖల్లివెల్లి చార్జిషీట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఈరబత్తిని అనిల్ మాట్లాడుతూ గల్ఫ్ బాధితుల కష్టాలు వర్ణనాతీతమని, 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని గల్ఫ్ బాధితుల కష్టాలను కెసిఆర్ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వాలు పేద వారి కోసమే ఉన్నాయని, లేని వారికి సహాయం చేయాలని కోరారు. ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్న అరవింద్ పార్లమెంటు నియోజకవర్గంలోని గల్ఫ్ బాధితుల సమస్యలను, ప్రజా సమస్యలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. గల్ఫ్ బాధితుల కోసం అరవింద్ ఒక్క సహాయం చేయలేదని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గల్ఫ్ వెళ్లిన సమయంలో ఒక్క గల్ఫ్ కార్మికున్ని కూడా కలవని ప్రధాన నరేంద్ర మోడీ అని అన్నారు. సౌదీలో మృతి చెందిన వ్యక్తి మృతదేహం ఇంటికి రావాలంటే సుమారు 30 రోజులు పడుతుందని, కరోనా సమయంలో స్వదేశానికి తిరిగి వచ్చిన వాళ్ళను నుండి క్వారంటైన్ పేరుతో అధిక డబ్బులు దండుకున్నారన్నారు. పేదల కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ఉన్న వారి కోసం కాదని అన్నారు. సోషల్ మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింల రాజ్యం వస్తుందనటం ఏంటనీ ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్న 30 లక్షల ఉద్యోగాలను ఇప్పటివరకు బిజెపి ప్రభుత్వం భర్తీ చేయలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లను తొలగించాలని బిజెపి చూస్తుందని, కుల గణన చేయాలని కాంగ్రెస్ చూస్తుంటే బిజెపి అడ్డు తగులుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి అందాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు. బీసీలకు వ్యతిరేకి ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. బిజెపి హయాంలో పేదోడికి న్యాయం జరుగ లేదన్నారు. జైల్లో పడ్డ గల్ఫ్ కార్మికులకు న్యాయ సలహాలు అందించడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందన్నారు. పేదలకు న్యాయం చేసే వ్యక్తి జీవన్ రెడ్డి అని, అలాంటి వ్యక్తిని మనం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకుందామన్నారు. మత వ్యామోహంలో పడితే దేశం సర్వనాశనం అవుతుందని, మత వ్యామోహం లేకుండా ఉండాలని కోరారు. అనంతరం జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు సిద్ధంగా ఉందన్నారు. జీవన్ రెడ్డిని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా అరవింద్ దుష్ప్రచారాలు చేస్తున్నాడని అరవింద్ ప్రజల ఎంపీ కాదు సోషల్ మీడియా ఎంపీ అన్నారు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో మతం పేరు చెప్పి ఓట్లను చేయించాలని బిజెపి చూస్తుందన్నారు. షుగర్ ఫ్యాక్టరీ పున ప్రారంభం పై క్లారిటీ లేని అరవింద్ గత పార్లమెంటు ఎన్నికలకు ముందు తాను ఎంపీగా గెలిపిస్తే ప్రభుత్వం తెరిపించకపోతే తన సొంత నిధుల ద్వారా షుగర్ ఫ్యాక్టరీ ఉన్న ప్రారంభిస్తారని చెప్పి ఐదు సంవత్సరాలు గడిచిన షుగర్ ఫ్యాక్టరీ పై ఎలాంటి పునరాలోచన చేయలేదన్నారు. ప్రస్తుతం కోరుట్ల నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఖాళీ అయిందని అన్నారు. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి జీవన్ రెడ్డి అని అలాంటి వ్యక్తిని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికలు ముగిసిన తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు అందిస్తామన్నారు. గల్ఫ్ లో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారికి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడమే కాకుండా వేములవాడ నియోజకవర్గం లో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులకు అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా గల్ఫ్ కార్మికుల వలస 20 వేలకు పైగా కోరుట్ల నియోజకవర్గంలో నుండి ఉన్నారని, వారి అభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుందన్నారు. గల్ఫ్ కార్మికుల సమక్షంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఆరోపణలు చేస్తూ చార్జిషీర్ పేరుతో పోస్టర్ను ఆవిష్కరించారు. గత పది సంవత్సరాల్లో గల్ఫ్ కార్మికులపై ప్రధాని మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ పసుపు బోర్డు కంటే మించినది స్పైస్ బోర్డు అని గతంలో రైతులను మోసగించి ఇప్పుడు పసుపు బోర్డు వచ్చిందని మళ్లీ లేనిపోని అపోహలు సృష్టించి రైతులను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. పసుపు దిగుబడి తగ్గడం వల్లనే పసుపు ధర పెరిగిందని కానీ అది బిజెపి ప్రభుత్వం వల్లనే పెరిగిందని అరవింద్ ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన అనునిత్యం పనిచేస్తుందన్నారు. కోరుట్ల నియోజకవర్గానికి కాంగ్రెస్ హయాంలో 3,500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించడం జరిగిందని, ఎన్నికల ముగిశాక అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు అందజేస్తామన్నారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అరవింద్ లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అనంతరం గల్ఫ్ నాయకుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఏనాడు బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదని, గల్ఫ్ కార్మికుల సమస్యలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే పరిష్కారం అవుతాయని ఆన్నారు. కాంగ్రెస్ నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు మాట్లడుతూ చార్జిషీట్ లోని నాలుగు ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోతే ఈ పార్లమెంటు ఎన్నికల్లో గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే నైతిహక్కు అరవిందుకు ఉండదని అన్నారు. 2020 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల పొట్టగొడుతూ కనీస వేతనాలు 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ సర్కులర్లు జారీ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కనీసం ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం చేతకాని అసమర్ధుడు అరవింద్ అన్నారు. ప్రవాసి భారతీయ బీమా యోజనలో సహజ మరణాన్ని చేర్చకుండా గల్ఫ్ కార్మికుల బతుకులతో బీజేపీ ప్రభుత్వం అడుకుంటే అరవింద్ కేంద్ర ప్రభుత్వంతో చర్చించకుండా తప్పించుకుంటూ తిరిగిన గల్ఫ్ ద్రోహి అని అన్నారు. హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్సులేట్ ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ కూడా రాయటం చేతకాని అజ్ఞాని అరవింద్ అన్నారు కరోనా కష్టకాలంలో గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చిన పేద కార్మికుల రక్తం పిండి రెండింతలు మూడింతలు విమాన చార్జీలు వసూలు చేసిందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫ్రీగా రప్పించాల్సిన కేంద్రం అధిక చార్జీలు వసూలు చేయడాన్ని ప్రశ్నించలేని అరవింద్ ఎంపీ పదవికి అనర్హుడనీ అన్నారు. గల్ఫ్ కార్మికులను గోదాములలో కూలీలుగా పని చేయొచ్చు స్వదేశానికి తిరిగి రండి అంటూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అవమానించారని టెక్నీషియన్స్ గా కార్మికులను పంపిస్తే ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సిఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత చేన్నమనేని శ్రీనివాస్ రావు, గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, జంగిడి మధు, గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నంగి దేవేందర్ రెడ్డి, మంద భీంరెడ్డి, ఆకుల లింగారెడ్డి, కొంతం రాజం గడ్డం వెంకటేష్ గౌడ్, పెరుమాండ్ల సత్యనారాయణ, ఏలేటి మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.