తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, మే, 04 : కోరుట్ల పట్టణంలోని గజం హోటల్ సమావేశ మందిరంలో శనివారం కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమమనికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వడి నర్సింగరావు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 06 గ్యారేటీలను ఇంటింటికి తీసుకవేళ్ళాలని, జీవన్ రెడ్డి గెలుపులో కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్స్ కీలక పాత్ర వహించాలని పార్టీ శ్రేణులకు దిశనిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు జువ్వడి కృష్ణారావు, చెన్నమనేని శ్రీనివాసరావు, బిసి సెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం వెంకటేష్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయినిపల్లి సత్యంరావు, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పెరుమాండ్ల సత్యం, రాజేశం, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.