Monday , September 16 2024

మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాల సాధనకై ఉద్యమిద్దాం

  • ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డా. పేట భాస్కర్

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, ఏప్రిల్ 11 : సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యాభివృద్ది కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాల సాధనకు ఉద్యమిద్దామని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ పిలుపునిచ్చారు. కోరుట్ల పట్టణంలోని సి.ప్రభాకర్ స్మారక గ్రంథాలయ అధ్యక్షులు రాస భూమయ్య అధ్యక్షతన గురువారం మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ విద్యా వికాసం వర్థిల్లా‌లని, కుల వ్యవస్థ నశించాలని సాంఘీక దురచారలకు వ్యతిరేకంగా సమసమాజ స్థాపన కోసం తన జీవిత కాలం పోరాడిన మహానీయుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. ఆయనను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పేట పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ గౌరవ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, నాయకులు సుతారి రాములు, రాసకొండ పెద్ద దేవయ్య, వుయ్యాల నర్సయ్య, తుమ్మనపల్లి రాజేంద్రప్రసాద్, ముల్క ప్రసాద్, పాతర్ల విజయ్, చింతకింది శంకర్, వుయ్యాల శోభన్, శనిగారపు రాజేష్, కొండపత్రి పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.