Tuesday , July 16 2024

దుబాయ్ పర్యటనలో గల్ఫ్ కార్మికులను కలిసిన ఎమ్మెల్సీ

సమస్యలు వివరించిన కార్మిక నాయకులు రాజా గౌడ్

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, ఏప్రిల్ 11 : దుబాయ్ పర్యటనలో భాగంగా ప్రభుత్వ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గురువారం గల్ఫ్ కార్మికులను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గల్ఫ్ కార్మీకుల సమస్యలపై యూఏఈ ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ తో సమావేశం నిర్వహించారు. దుబాయ్ లోని వివిధ ప్రాంతాలను సందర్శించి, అక్కడున్న ప్రవాస భారతీయులను కలిసి, వారి సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను రాజా గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ మాట్లడుతూ వెల్లుల్ల గ్రామ వాసి, తెలంగాణా ఉద్యమ కర్త ప్రస్తుత, యూఏఈ ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు కళాకారుడు రాజాగౌడ్ గ్రామ గ్రామన పాటలు పాడి తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజలను చైతన్యం చేశారని కొనియాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజా గౌడ్ ను కోరారు. గల్ఫ్ కార్మికుల కోసం కృషి చేస్తున్న రాజాగౌడును అభినందించారు. ప్రవాస మిత్ర లేబర్ యనియన్ అద్యక్షుడు బతిని రాజాగౌడ్ మాట్లడుతూ గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్మీకుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, గల్ఫ్ ఏన్ ఆర్ ఐలు తమ అమూల్యమైన ఓటు హక్కును ఆన్లైన్ ద్వారా వినియోగించుకునేలా తక్షణమే చర్యలు వేగవంతం చేయాలని కోరారు. గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు వీసా చార్జీలు, రిక్రూట్మెంట్ ఫీజులు తదితర ఖర్చులకోసం పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలని, గల్ఫ్ లో చనిపోయిన కార్మికులకు రైతు బీమా 05 లక్షలు, గల్ఫ్ ప్రవాసీ బీమా పథకాలు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. విదేశాలకు వెళ్లి ఏజెంట్ల కారణంగా లేదా అక్కడి యాజమాన్యాల కారణంగా మోసపోయి నష్టపోయి తిరిగి వచ్చిన వారిని ఆదుకోవడానికి కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వలు సబ్సిడీతో కూడిన రుణాలను ఇచ్చి, స్థానికంగా ఉపాధి అవకాశాలను తక్షణమే కల్పించాలన్నారు. విదేశాల్లో మరణించిన వారి శవపేటికలను హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి వారి స్వగ్రామాల వరకు రవాణాకై ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించాలని కోరారు. జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం, హైదరాబాద్ లో ప్రవాసీ భవన్ ఏర్పాటు, గల్ఫ్ నుండి వాపస్ వచ్చినవారు జీవితంలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ కొరకు ప్రత్యేక పథకం రూపకల్పన చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో సుద్దాల స్వామి గౌడ్, కోటగిరి వినయ్ కుమార్, చెక్కిలా నవనీత్, కోటగిరి కిరణ్, రాజేష్ శర్మ, పజల అనాథ్,రఘు, శ్రీనివాస్ కార్మిక నాయకులు పాల్గొన్నారు.