Wednesday , July 24 2024

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం..

  • కౌన్సిలర్ అడెపు కమల మధు

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, మార్చి 03 : పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని 15,వ వార్డు కౌన్సిలర్ అడెపు కమల మధు ప్రజలను కోరారు. కోరుట్ల పట్టణంలోని హాజిపుర 15,వ వార్డులో ఆదివారం పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించారు. వార్డులోని బస్తీ దవాఖాన, అంగన్వాడీ సెంటర్లలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కౌన్సిలర్ అడెపు కమల మధు మాట్లాడుతూ చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడం ద్వారా పోలియో వ్యాధిని నివారించవచ్చని అన్నారు. ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు తప్పకుండా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో చుక్కలు వేయించుకోని వారి కోసం ఆరోగ్య సిబ్బంది వార్డులో పర్యటించి ఇంటింటికి వచ్చి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేస్తారనితెలిపారు. ఎవరైనా పోలియో వేసుకొని వారు ఉంటే తనకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, ఏ లక్ష్మి, పుష్ప లత, రమ దేవి, ఆశా వర్కర్ ఏ జ్యోతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆడేపు మధు, ఎం.ఎం అలీ బేగ్, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.