తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, మే, 05 : కోరుట్ల పట్టణంలోని 23,వ వార్డ్ హనుమాన్ నగర్ లో బూత్ నంబర్ 155 బూత్ అధ్యక్షురాలు చెట్టిపెల్లి మమత ఓం ప్రకాష్ ఆద్వర్యంలో ఆదివారం బిజెపి నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడి పాలనలో కరోనా సమయంలో ఉచిత కరోనా వ్యాక్సిన్, ఉచిత రేషన్ బియ్యం, మరుగు దొడ్ల నిర్మాణం, ఉజ్వాల గ్యాస్ కనెక్షన్, ఉచిత కుట్టు మెషిన్, సబ్సిడీ లోన్స్ తదితర అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కమలం పువ్వు గుర్తుకు వేసి ఓటు వేసి ధర్మపురి అరవింద్ ను అదిక మెజారిటీతో గెలుపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు సూరతని బాగ్యలక్ష్మి. సురతని మల్లారెడ్డి ఐపిఎఫ్ దుబాయ్ స్టేట్ ఎక్సటివ్ మెంబర్. రాయికల్ మండల అధ్యక్షురాలు సుజాత, జగిత్యాల జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పూర్ణిమ చౌదరి, స్టేట్ మహిళ కొ కన్వినర్ నీలి గాయత్రి తదితరులు పాల్గొన్నారు.