Friday , October 4 2024

ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ‘మొహబ్బత్ కి దుకాన్` కార్యక్రమం

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, మే, 04 : ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాష్ట్ర ఇంఛార్జి మహమ్మద్ ఫహాద్, ప్రతిక్ సింగ్ ల ఆదేశాల మేరకు ఎన్ఎస్యూఐ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని పీవీ నర్సింహారావు వెటర్నరీ కాలేజ్ ఆవరణలో శనివారం మహబ్బత్ కి దుకాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ జిల్లా ఆదక్షులు సదుల వినయ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ సంవత్సరానికి 02 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, పది సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే యువతకు కలిగే ప్రయోజనాలను వివరించారు. కేంద్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పడితే విద్యార్థులు, నిరుద్యోగులు, దేశ ప్రజలకు ఏం చేస్తారనే అంశాల పైన చర్చించారు. యువకులందరు కచ్చితంగా కాంగ్రేస్ ఎంపిలని గెలుపించుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ కార్యనిర్వాహ అద్యక్షులు విజయ్ పటేల్, జిల్లా ఉపాధ్యక్షుడు శివ, మెట్ పెల్లి పట్టణ అధ్యక్షుడు షేర్ భరత్, కోరుట్ల అసెంబ్లీ కార్యనిర్వాహ ఆదక్షులు గడ్డల భరత్, మల్లాపూర్ మండల అధ్యక్షుడు నరేష్, అబ్దుల్ జాకిర్, తదితరులు పాల్గొన్నారు.