Monday , September 16 2024

రాజేందర్ రావుకు మద్దతుగా చెదలు సత్యనారాయణ ప్రచారం

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, మే, 04 : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చెదలు సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం సుమారు 800 మంది ఉపాధి హామీ కూలీల వద్దకు పోయి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చెదలు సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంట్ బిల్లు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహలక్ష్మి పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. వెలిచాల రాజేంద్ర రావును గెలిపిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో ఏర్పడితే ఉపాధి హామీ కూలీలకు మినిమం కూలి వేతనం 400 రూపాయలు అందజేస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కట్ట శంకర్, వంద మహేష్, తోట నరేష్, తోట రమేష్, మేకల మల్లేశం, కొప్పుల గంగారెడ్డి, బోదాస్ నరసయ్య, వేముల కృష్ణ, బోధ, సప్పి తదితరులు పాల్గొన్నారు.