తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, మే, 04 : ఎండల తీవ్రత దృష్ట్యా కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ బట్టు తిరుపతి శనివారం పారిశుద్ధ కార్మికులకు, వాటర్ సప్లై కార్మికులకు, ఎలక్ట్రికల్ వర్కర్స్ కు ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేశారు. ఇంజనీరింగ్ సెక్షన్ లో పని చేసే వాటర్ సప్లై సిబ్బందికి చల్లటి నీటి క్యాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పారిశుద్ధ్య కార్మికులు, వాటర్ సప్లై, ఎలక్ట్రికల్ కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, మున్సిపాలిటీ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.