Monday , September 16 2024

నిరుపేద ముస్లింలకు రంజాన్ తోపా పంపిణీ చేసిన చించోడ్ అభిమన్యు రెడ్డి

తెలంగాణ కెరటం జడ్చర్ల ఏప్రిల్ 10:

రంజాన్ మాసం పురస్కరించుకొని బుధవారం రాజాపూర్ మండలంలోని రాజాపూర్, తిర్ములపూర్, చోక్కంపేట్, రాఘవపూర్, కుత్నిపల్లి, చెన్నవెళ్ళి, కుచ్చర్ కల్, ఈద్గన్ పల్లి, రంగారెడ్డి గూడ, గ్రామాలలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు తన స్వంత ఖర్చులతో యువసేన సభ్యుల ద్వారా పేద ముస్లిములకు రంజాన్ పండుగకు తోపాలను పంపిణీ చేసిన జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి ఈ సందర్భంగా అభిమన్యు రెడ్డి మాట్లాడుతూ పేదరికానికి కులం, మతం లేవని పేర్కొన్నారు. పేదలకు సేవ చేయడంలోనే ఆత్మ సంతృప్తి దొరుకుతుందని తెలిపారు. తదనంతరం ముస్లిం సోదర, సోదరీమణులకు అభిమన్యు రెడ్డి ముందస్తుగా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల కో ఆప్షన్ సభ్యులు మీర్జా అల్తాఫ్ బేగ్ మాట్లాడుతూ నిత్యము నిరుపేదల గురించి ఆలోచిస్తూ నిరుపేదల అభ్యున్నతికి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తూ పేద ముస్లింలకు రంజాన్ తోపాల అందించిన యువనేత చించోడు అభిమన్యు రెడ్డికి మండల మైనార్టీ సోదరుల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని మజీద్ ప్రాంగణంలో అభిమన్యు యువసేన నాయకులు అన్మగళ్ళ నర్సిములు, రాచమల్ల యాదగిరి, అల్లె శ్రీనివాస్, విజయ్, అల్లె తిరుపతయ్య, అబ్దుల్ ఆరిఫ్, మీర్జా అల్తాఫ్ బేగ్, వనపర్తి దేవేందర్, పోలెమోని లింగం, నజీమ్ బేగ్ లతో పాటు ఆయా గ్రామాల మైనార్టీ నాయకులు, అభిమన్యు యువసేన నాయకులు పాల్గొన్నారు.