Monday , September 16 2024

ఐటీ హబ్ జాబ్ మేళాకు మెగా స్పందన

745 ఉద్యోగాలకు గాను పదివేల దరఖాస్తులు

పలు కంపెనీల ఎంపిక మరికొన్ని వెయిటింగ్ జాబితాలో

తెలంగాణ కెరటం నిజామాబాద్ జిల్లా బ్యూరో

నిజామాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ అయిన టాస్క్ ఆధ్వర్యంలో

ఏర్పాటుచేసిన ఉద్యోగ మెగా మేళాకు చక్కని స్పందన వచ్చింది. జిల్లా కేంద్రంలోని భూమిరెడ్డి కన్వెన్షన్ లో శుక్రవారం టాస్క్ సంస్థ ఐటీ ఉద్యోగాలకు మెగా జాబ్ మీదను ఏర్పాటు చేయగా సుమారు పదివేల మంది నిరుద్యోగ యువత ఐటి రంగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఐటీ రంగంలో జిల్లా కేంద్రంలో 745 ఉద్యోగాలు ఉండగా 15 కంపెనీలు ఈ ఉద్యోగాల కోసం ఉద్యోగాల కోసం ఎంపిక చేసేందుకై జిల్లా కేంద్రంలోని జాబ్ మేళాకు తరలివచ్చాయి అయితే ఈ కంపెనీలలో పని చేయడానికి సుమారు ప 8000 మందివేలకు పైగా నిరుద్యోగ వివిధ సాఫ్ట్వేర్ రంగంలో నైపుణ్యం సాధించిన యువతీ యువకులు దరఖాస్తు రిజిస్ట్రేషన్ రూపంలో చేసుకున్నంగా చేసుకున్నారు. అందులో కొన్ని కంపెనీలకు కావలసిన అర్హతలు ఉన్న నిరుద్యోగులను ఎంపిక చేసుకోగా మరికొన్ని కంపెనీలు రెండు మూడు రోజుల్లో తమ అర్హతలకు అనుకూలమైన నిరుద్యోగ యువతను ఉపాధి అవకాశాలు ఇచ్చేందుకు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే ఈ ఉద్యోగం మీదను

స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ తోపాటు రాష్ట్ర ఐటీఎం శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో

ఏర్పాటుచేసిన టాస్క్ ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో కొంతమంది యువతి, యువకులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నరూ. మరికొందరు విద్యార్థిని విద్యార్థులు,తమ సంబంధించిన విద్యార్హత పత్రాలన్నీ కంపెనీల నిర్వాహకులకు అప్పజెప్పారు. ఏదేమైనా శుక్రవారం జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటుచేసిన ఉద్యోగ మెగా మేళకు ఐటీ రంగంలో ప్రత్యేక ఆదరణ లభించింది. భారీ సంఖ్యలో యువతి యువకులు వివిధ ఐటి రంగంలో చదువులు అభ్యసించిన వారందరూ.. అధిక సంఖ్యలో జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చారు 745 మంది ఉద్యోగ అవకాశాలు గాను సుమారు 8000 దరఖాస్తులు వచ్చాయని ఆ కంపెనీ కార్య నిర్వహణ అధికారులు తెలిపారు.దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరికి కొత్తగా ప్రారంభం ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటి హబ్ నందు అవకాశం దక్కుతుందో వేచి చూడాల్సిన ఉంది.