Friday , October 4 2024

ఐటీ హబ్ కేవలం బిల్డింగ్ కాదు.. యువత ఆశలు ఆకాంక్షలకు ప్రతిబింబం… మంత్రి కేటీఆర్.


తెలంగాణ కెరటం: ఆగస్టు 5 నిజామాబాద్ బ్యూరో


నిజామాబాద్ ఐటి హబ్ అంటే కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు యువతకు వారియొక్క ఆశలకు ఆకాంక్షలకు ప్రతిబింబమని ఐటి, పారిశ్రామిక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. భవిష్యత్తులో యువత హైదరాబాద్, అమెరికా వెళ్లాలంటే ఒక మెట్టు ఇక్కడ ఎక్కేందుకు ఐటి హబ్ ఏర్పాటు చేశామని వారు పేర్కొన్నారు. నిజాంబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీ టవర్ మరియు జిల్లా నైపుణ్య అభివృద్ధి కేంద్రం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఐటీ టవర్ నందు ప్రణతి సొల్యూషన్ ప్రైవేట్ కంపెనీని ఆయన పరిశీలించాడు

. అందులోని ఐటి ఉద్యోగులతో మాట్లాడారు. అనంతరం స్థానిక గిరిరాజ్ కళాశాల గ్రౌండ్ నందు ఏర్పాటుచేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. ప్రభుత్వం నుండి ప్రజలు కోరుకునేది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన తెలిపారు. 50 కోట్ల రూపాయలతో ఐటీ హబ్ నిర్మించామని ఇక్కడ డిగ్రీ డిప్లమా ఇంజనీరింగ్ చదివిన 1400 మంది పిల్లలకు ఉద్యోగాలు కల్పించామని, భవిష్యత్తులో ఉద్యోగం కావాలన్నా వారికి మీరే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్న నైపుణ్యం పెంచుకోవాలని ఆయన అన్నాడు. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయని మన భవిష్యత్తు భద్రంగా తల్లిదండ్రులు గర్వపడేలా ఉండాలంటే ఇలాంటి సదుపాయాలను

అందిపుచ్చుకోవాలని కేటీఆర్ సూచించారు. పక్కనే ప్రత్యేకంగా 11 కోట్లతో జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖతోపాటు దానిలో ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. మునుపు ఎన్నడూ లేని విధంగా ఏడు కోట్లతో మున్సిపల్ కార్యాలయాన్ని ఆధునీతనంగా నిర్మించామని ఇట్టి కార్యాలయం తెలంగాణ రాష్ట్రంలోని బెస్ట్ కార్యాలయం అని చెప్పుకోవచ్చు అని ఆయన అన్నారు. అంతేకాకుండా రఘునా చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అద్భుతంగా తీర్చిదిద్దారని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ నగరంలో 15 కోట్ల 50 లక్షల తో హైదరాబాదులోని మహాప్రస్థానం కంటే బాగా నిజామాబాద్ దుబ్బా ప్రాంతంలోని వైకుంఠధామాలు నిర్మించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.