Sunday , May 26 2024

ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ

ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.తెలంగాణ కెరటం గజ్వేల్: 08మార్చి 2023అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మార్కేట్ కమిటీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో మహిళా రైతులతో కేక్ కట్ చేయించి వారిని శాలువతో సత్కరించి మెమోంటో బహుకరించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ సమాజంలో పురుషుడితో పాటుగా అన్ని రంగాల్లో మహిళలు సమాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కుటుంబ అభివృద్ధిలో ఇల్లాలిగా స్త్రీ పాత్ర ఎంతో గొప్పదని త్యాగపూరితమైందని అన్నీతానై కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ అందరి ఆలనా పాలనా చూసే ఆదర్శమూర్తులుగా మహిళలు ప్రసిద్ధికెక్కినారన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ సాధారణ సెలవు దినంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ సెర్ప్‌, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఈనెల బుధవారం రూ.750 కోట్ల రుణాలు విడుదల చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించిన విషయాన్ని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ఆరోగ్య మహిళ కార్యక్రమం చేపట్టి ప్రతి మంగళవారం వనితలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేపడుతున్న విషయాన్ని కూడా వారు స్పష్టంచేశారు. ఇటువంటి మహోత్తర కార్యక్రమాన్ని ఆడబిడ్డలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఒక తల్లి కనబరిచే ప్రాపంచిక దృక్పథాన్ని, దార్శనికతను ముఖ్యమంత్రి కేసీఆర్ అన్వయించుకుని తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని అన్నారు. తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి నేటివరకు ఆడపిల్లల పెండ్లికి కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ ద్వారా ఆర్థికంగా ఆదుకుంటూ తల్లులకు కేసీఆర్ కిట్స్ అందించి ఆర్థికంగా అండగా నిలుస్తూ ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి, వంటి పథకాలతో పాటు, వితంతువులు, వృద్ధ మహిళలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు నెల నెలా సకాలంలో పెన్షన్లు అందచేస్తూన్నా ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని కొనియాడారు. షీ టీమ్స్ ద్వారా రక్షణ కల్పిస్తూ. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లకు జీతాల పెంచడంతో పాటు మహిళలకు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వారికి అవకాశాలు కలిపించడం జరిగిందని అన్నారు.దేశంలోనే ప్రప్రథమంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్స్ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలించిందని మహిళకు సామాజిక ఆర్థిక సాధికారతతో పాటు తద్వార వారి భద్రతకు సమున్నతంగా ప్రాధాన్యత కలిపిస్తున్న రాష్ట్రముగా కేసీఆర్ నాయకత్వంలో వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకమిటి చైర్మన్ ఊడేం కృష్ణ రెడ్డి, భారస మండల ప్రెసిడెంట్ బెండే మధు, టౌన్ ప్రెసిడెంట్ నవాజ్ మీరా, మర్కుక్ మండల ప్రెసిడెంట్ కరుణాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ జఖి ఉద్దీన్,సర్పంచ్ల ఫోరమ్ మండల అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి, మార్కెట్ సెక్రటరీ జాన్వెస్లీ , ఏ ఓ నాగరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రూబెన్ , యాదగిరి, బాల కిషన్, ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు ఆకుల దేవేందర్, రమేష్ గౌడ్, భీమప్ప,శివకుమార్, ఉమర్,ఆత్మకమిటి డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, శ్రీను, వెంగల స్వామి,రాజు, సర్పంచ్లు బాల్ చంద్రం, రజిత వెంకటేష్,శ్రీనివాస్ రెడ్డి, మహిళా రైతులు, ఏ ఈ ఓ లు, సూపర్వైజర్ మహిపాల్ మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

9 comments

 1. Hello there! This post couldn’t be written any better! Reading through this post reminds me of
  my previous room mate! He always kept talking about this. I will forward this write-up to him.
  Fairly certain he will have a good read. Thanks for sharing!

 2. Heya just wanted to give you a quick heads up and let you know a few of the pictures aren’t loading correctly.
  I’m not sure why but I think its a linking issue. I’ve tried
  it in two different web browsers and both show the same results.

 3. Hi would you mind stating which blog platform you’re working with?
  I’m looking to start my own blog in the near future but I’m having a difficult
  time choosing between BlogEngine/Wordpress/B2evolution and Drupal.
  The reason I ask is because your design seems different then most blogs and I’m looking for something unique.
  P.S Sorry for getting off-topic but I had to
  ask!

 4. Thanks for finally writing about > ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ – Telangana
  Keratam < Loved it!

 5. It’s actually very complex in this full of activity life to listen news on TV,
  thus I only use world wide web for that purpose, and get the most recent information.

 6. Good information. Lucky me I found your blog by chance (stumbleupon).
  I have saved it for later!

 7. Hi, I do think this is a great site. I stumbledupon it 😉 I’m going to
  come back once again since I book marked it. Money and freedom
  is the greatest way to change, may you be rich and continue to help other people.

 8. Great article! That is the kind of info that should be shared around the internet.
  Disgrace on the search engines for not positioning this publish higher!

  Come on over and talk over with my site . Thank you =)

 9. I’m curious to find out what blog platform you’re utilizing?
  I’m having some minor security issues with my latest website and I’d like to find something more secure.
  Do you have any recommendations?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *