Monday , September 16 2024

ప్రజా క్షేత్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి శిక్ష తప్పదు,,

తెలంగాణ కెరటం హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణం ప్రతినిధి మే 20:

రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన,బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు,జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు జీడి మల్లేష్ అధ్యక్షతన ఈరోజు జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించి, మాయమటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని సంపత్ రావు ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం వరి దాన్యాన్ని కొనుగోలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. ఎలాంటి కోతలు లేకుండా పండిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేసి క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో లాగానే ఈ ప్రభుత్వంలో కూడా క్వింటాలు వరి ధాన్యానికి 5 నుండి 7 కిలోల వరకు కటింగ్ చేస్తున్నారని, కానీ ఈవిషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి,రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కనపడకపోవడం శోచనీయమని అన్నారు. రేవంత్ రెడ్డికి రైతులకు ఇచ్చిన హామీల పట్ల చిత్తశుద్ధి లేదని,ఉంటే కొనుగోలుకు ముందే అధికారులతో సమీక్ష జరిపే వాడని సంపత్ రావు ఆరోపించారు. దొంగలు పడ్డంక ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా వరి ధాన్యం కొనుగోలు చివరి దశకు వచ్చే సమయంలో రేవంత్ రెడ్డి సమీక్ష పేరిట రైతులను మభ్య పెట్టడానికి చూస్తున్నాడని సంపత్ రావు చురకంటించారు. అకాల వర్షంతో తడిచిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు,తరుగు లేకుండా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీల పేరిట అమలు కానీ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడని సంపత్ రావు మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని సంపత్ రావు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సంపత్ రావు తో పాటు, పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, కోర రవీందర్, పల్లపు రవి, ఠాగూర్ రాజేష్, అప్ప మధు, యాదవ్ కొమ్ము, అశోక్ ఇటుకల స్వరూప కొండ్లె నాగేష్ రావుల శ్రీనివాస్ మోడం రాజు, ముకుంద సుధాకర్, వేముల జగన్, అప్పల రవీందర్, కొండపర్తి ప్రవీణ్, ఉడుగుల మహేందర్, వీణవంక శివ, ఎర్ర వెంకటేష్, ఎ సృజన, శ్రీ కేశ సరూప, ఆవంచ వెంకటేష్, నాగపురి విజయ్, తాళ్ల పెళ్లి తిరుపతి, కురుమిళ అశోక్, మంతిని అశోక్, ఏ రామస్వామి, ఎద్దుల పురం శ్రీనివాస్, తదితరు పాల్గొన్నారు