తెలంగాణ కెరటం: హుజూరాబాద్ నియోజకవర్గం, ఫిబ్రవరి25:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో గల ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన సౌత్ ఇండియా నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంకు చెందిన కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందిన ఇద్దరు విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి బహుమతులు సాధించినట్లు కరాటే మాస్టర్ జలీల్ ఆదివారం రోజున తెలిపారు. ఈ కరాటే పోటీలలో వివిధ రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుండి సుమారు 500 మంది కరాటే విద్యార్థులు పాల్గొన్నారన్నారనీ, హుజూరాబాద్ కు చెందిన ఎస్, షాదుల్లాబాబా 11 సంవత్సరాల విభాగంలో కటాస్ లో సిల్వర్ మెడల్ సాధించగా, 8 సంవత్సరాల విభాగంలో మొహమ్మద్ లతీఫ్ బాబా, కటాస్ లో గోల్డ్ మెడల్ సాధించారన్నారు. సౌత్ ఇండియా నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలల్లో హుజూరాబాద్ నుండి పాల్గొని బహుమతులు సాధించిన షాదుల్లా బాబా, లతీఫ్ బాబా అనే విద్యార్థులను, కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ను రిటైర్ ఎంఈఓ గొట్టే జమదగ్ని, మార్కెట్ కమిటీ మాజీ సభ్యుడు మహమ్మద్ ఖాలీద్ హుస్సేన్, నాయకులు ఉప్పు శ్రీనివాస్ పటేల్, మొహమ్మద్ అలీం, ఇప్పలపల్లి చంద్రశేఖర్, రావుల రాజేష్ లు అభినందించి హర్షం వ్యక్తం చేశారు.