Tuesday , July 16 2024

//

ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు.

10 సంవత్సరాల బిజెపి ప్రభుత్వంతో పేదలకు ఒరిగిందేమీ లేదు.

కేంద్ర ప్రభుత్వం చేత బలహీన వర్గాల ప్రజలకు అన్యాయం జరిగింది.

పేదల సంపదను పెద్దలకు దోచిపెట్టిన మోడీ సర్కార్.

చాడ వెంకటరెడ్డి, సిపిఐ మాజీ ఎమ్మెల్యే,సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు.

తెలంగాణ కెరటం హుస్నాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 15

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలను దీని తోటి దేశ ప్రజల భవిష్యత్తు మారబోతుందని అందుకు ప్రజలు సమాయత్తం కావాల్సిన సమయం దగ్గర పడిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు సోమవారం హుస్నాబాద్ పట్టణంలో గల అనభేరి సిపిఐ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో బిజెపి ప్రభుత్వం పేదలకు ఏం చేయలేదని ఎలాంటి సంక్షేమ పథకాలు పేదలకు అందలేదని పేద ప్రజల పట్ల పక్షపాతి చూపించిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. పేదల సంపదను పెద్దలకు దోచిపెట్టిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందని ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోఇండియా కూటమితో సిపిఐ పార్టీ జతకట్టి కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా నుండి పూర్తి సహకారం అందిస్తామని అందుకు అనుగుణంగా జాతీయ నేతలతో సంప్రదింపులు జరిగాయని ఆయన అన్నారు ఇప్పటికే 10 సంవత్సరాలు పరిపాలించి మోడీ సర్కార్ దేశ ప్రజలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చిందని కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీ మరియు అనుబంధ మిత్రపక్షాలకు దేశవ్యాప్తంగా ప్రజలు గట్టి బుద్ధి చెప్పి జాతీయస్థాయిలో ఇండియా కూటమికి మంచి మెజారిటీ ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడపే మల్లేష్ మరియు నాయకులు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.