Saturday , October 12 2024

మతాన్ని అడ్డుపెట్టుకుకొని ప్రజాస్వామ్యన్ని ఖూని చేస్తున్న భాజపానాయకులు.

మీడియాతో రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్.

తెలంగాణ కెరటం హుస్నాబాద్ ప్రతినిధి ఫిబ్రవరి 26

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారింటిలలో భాగంగా రెండు మంగళవారం రోజున చేవెళ్ల నియోజకవర్గం నుండిరాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీతో కలిసి గ్యాస్ సిలిండర్ పథకాన్ని లాంచనంగా ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో మంగళవారం
నుండి 500 కే గ్యాస్ పథకం అమలవుతుండడంతొ మహిళలతో కలిసి గ్యాస్ సిలిండర్ కి పూలు వేసి శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాగ్దానాలు అన్ని నెరవేరుస్తున్నామని,
ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరుతున్నామని,
రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజాస్వామ్య పద్ధతి లో చేసుకోవాలని
మేము ఇచ్చిన హామీలు వంద రోజులు కూడా పూర్తికాకముందే ప్రేరేపితమైన మాటలు ప్రభుత్వాలు కూలగొడతామనే మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు .
ఆది మంచి పద్ధతి కాదన్నారు
మేము ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ రవాణా సౌకర్యం , ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు.
మహిళలకు 500 రూపాయల కే సిలిండర్ అందిస్తుండడం మహిళల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నామని,
మహిళలు వారి కార్యక్రమాలను విస్తృతపరచుకుంటున్నారు
మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని
దేవాలయాలకు, హాస్పిటలకు ఉచితంగా స్వేచ్ఛగా వెళ్తున్నారు .
ప్రజా చైతన్య యాత్ర చేస్తున్న బండి సంజయ్ ని అడుగుతున్న..
మీ ప్రభుత్వం 500 కే సిలిండర్ ఇవ్వగలుగుతుందా…? 500 సిలిండర్ 1200 కు పెంచారు మీరు ఏం జవాబు చెబుతారు..? అని బండి సంజయ్ కి మంత్రి పొన్నం సూటి ప్రశ్న అడిగారు
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ చెప్పాలి
5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న మాట్లాడకుండా ఎన్నికలు వస్తున్నాయని రామాలయం పేరు మీద ఓట్లు అడిగితే కాదు
మతపరమైన అంశాలతో ఓట్లు అడగడం కాదు, ప్రజాస్వామ్యతంగా ఓట్లు అడగాలని సూచించారు .
తెలంగాణకు బిజెపి ఏం చేసిందో చెప్పాలి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడిగా ఏం కొట్లాడి నిదులు తెచ్చారో చెప్పాలని ఆయన అన్నారు
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బిజెపి ప్రజాహితం పేరిట యాత్రలు చేస్తోందని ఆయన తెలిపారు.