Wednesday , July 24 2024

జర్నలిస్టులు ప్రజా సమస్యలపై వార్తలు రాయాలి.

ప్రజల సమస్యల కోసం జర్నలిస్టులు ఎల్లప్పుడూ పని చేయాలి.

సమాజంలో సమస్యలపై గలమెత్తినప్పుడే గుర్తింపు లభిస్తుంది.

సమ సమాజ నిర్మాణం జర్నలిస్టులతోనే సాధ్యం.

హుస్నాబాద్ లో డీ జే ఎఫ్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం.

డీజేఎఫ్ గౌరవ మరియు జాతీయ అధ్యక్షులు విశ్వనాథరెడ్డి మనసాని కృష్ణారెడ్డి.

తెలంగాణ కెరటం హుస్నాబాద్ ప్రతినిధి మే 4

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన వార్తలు రాసినప్పుడే సమాజంలో జర్నలిస్టులకు తగిన గుర్తింపు లభిస్తుందని డెమొక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు మనసాని కృష్ణారెడ్డి అన్నారు శనివారం హుస్నాబాద్ పట్టణంలో నూతన డి జె ఎఫ్ కార్యాలయాన్ని జాతీయ అధ్యక్షులు విశ్వనాథరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వేరే నాయకులకు సంబంధించిన వార్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగపడే రోజు వారి సమస్యలపై వార్తలు రాసి వారికి మేలు చేసే విధంగా ఉపయోగపడే వార్తలు రాసినప్పుడే విలేకరులకు సమాజంలో ఒక సరియైన గుర్తింపు లభిస్తుందని వారు అన్నారు గత ప్రభుత్వాలు జర్నలిస్టులకు మొండి చేయి చూపించిందని ఇళ్ల స్థలాల విషయంలో కానీ మరియు ఆరోగ్య బీమా పథకంలో గానీ ఎలాంటి రాయితీ కలిగించకుండా మోసం చేశాయని అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పనిచేస్తుందని ఇలా అయితే పరిపాలనకు కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టమవుతుందని అన్నారు విలేకరుల సమస్యలపై ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయిలో మంత్రివర్గంతో చర్చిస్తూ వినతి పత్రాలు ఇస్తున్నామని మన సమస్యలకు పరిష్కారం తొందరలో లభిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో డి జె ఎఫ్ రాష్ట్ర పిఆర్ఓ సిద్దు ,డివిజన్ అధ్యక్షులు పరకాల వంశీకృష్ణ , ప్రధాన కార్యదర్శి దేవేందర్ నాయక్ ,ఉపాధ్యక్షులు గొర్ల విజయ్, గౌరవ సలహాదారు బోయిని రమేష్ కోశాధికారి నరేష్ సంయుక్త కార్యదర్శి బొద్దున శ్రీనివాస్ మీడియా పిఆర్ఓ అఖిల్ మరియు గుర్రాల శ్రీనివాస్ రాజేందర్ సందీప్ నాయక్ కార్యవర్గ సభ్యులు వికాస్ గౌడ్ మార్కా రమేష్ అరుణ్ శ్రీకాంత్ దిలీప్ కుమార్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.