Monday , July 22 2024

కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలి

కార్యకర్తలు ,నాయకులు అందరూ కష్టపడి పనిచేయాలి.

గత ఐదు సంవత్సరాల్లో కరీంనగర్ కు బండి సంజయ్ చేసిందేమీ లేదు.

కార్యకర్తల సమావేశంలో పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి.

తెలంగాణ కెరటం హుస్నాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 19

కరీంనగర్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసినప్పుడే కరీంనగర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు శుక్రవారం హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం స్థానిక శుభం గార్డెన్ లో నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ
హుస్నాబాద్ లో 304 పోలింగ్ బూత్ లు ఉన్నాయి.
అన్ని పోలింగ్ బూత్ లలో మెజారిటీ రావాలి.
గత ఎన్నికల్లో 260 పోలింగ్ బూత్ లలో మెజారిటీ వచ్చింది.
ఈ ఎన్నికల్లో 304 పోలింగ్ బూత్ లలో మెజారిటీ తెచ్చుకోవాలి..
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత ప్రయాణం,500కి గ్యాస్ ,200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.
ఎన్నికల తరువాత నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటామని
కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయని
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తోందని అన్నారు
వర్షాకాలం పంట కి 500 బోనస్ ఇస్తామని దీనిపై రైతులు అధైర్య పడద్దని ప్రతిపక్ష పార్టీల మాటలను నమ్మి మోసపోవద్దని రైతులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు
కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ నియోజకవర్గానికి ఏమైనా చేశాడా..
బండి సంజయ్ ఏదైనా గ్రామంలో తిరిగడా అని ప్రశ్నించారు
ఈ 10 సంవత్సరాల్లో కేంద్రం నుండి మన మండలానికి నియోజకవర్గానికి ఏ గ్రామానికి అయిన ఏమైనా చేశారా…?
బిఆరెస్ ఎంపి అభ్యర్థి వాళ్ల పార్టీ నేతలకు కూడా చెయ్ కలపరు.
నేను ఎంపి గా 5 సంవత్సరాలు ఏం చేసాను.మీరు బండి సంజయ్ వినోద్ కుమార్ ఎంపిగా ఏం చేశారో చర్చిద్దామని బండికి సవాలు చేశారు
హుస్నాబాద్ ఎమ్మెల్యే అయితే మీ గౌరవం పెరిగేలా చేస్తా అన్నారు
ఈ 5 నెలల్లో విద్యాలయాలు , హాస్పిటల్ లు ఇలా ఎది ఉన్న మీ ముందుండి అన్ని కార్యక్రమాలు చేపట్టా
ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్న అంటే మీ ఆశీర్వాదం.
పార్టీ కోసం అందరూ కష్టపడాలి.మీ మీ బూత్ లలో మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని మంత్రి పొన్నం అన్నారుఈ కార్యక్రమంలోవేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ గౌడ్, అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి , హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు