Monday , September 16 2024

హోలీ పండుగ సందర్భంగా పోలీస్ వారి సూచనలు పాటించాలి. మక్తల్ సీఐ చంద్ర శేఖర్

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.

హోలీ పండుగ సందర్భంగా ప్రజలు పోలీసువారి సూచనలు పాటించాలని మక్తల్ సర్కిల్ ప్రజలకు *సిఐ చంద్ర శేఖర్ * ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించరాదని, ఏలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మక్తల్ సర్కిల్ పరిధిలోని ప్రధాన చౌరస్తాలలో పోలీస్ పికెట్స్ నిరంతరం పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, యువకులు హోలీ ఆడేటప్పుడు కెమికల్స్ కు సంబంధించిన రసాయన కలర్స్ ను ఉపయోగించరాదని, రసాయనాల వల్ల చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అని తెలిపారు. ముఖ్యంగా యువకులు హోలీ ఆడే సమయంలో సంయమానం పాటించాలని, అత్యుత్సాహం ప్రదర్శించరాదని తెలిపారు. ద్విచక్ర వాహనాలపై రష్ డ్రైవింగ్ చేయరాదని, ప్రజలకు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించరాదని తెలిపారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని మైనర్ డ్రైవింగ్ చేసే వారినీ పట్టుకొని వారి తల్లిదండ్రుల పై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. పోలీస్ సిబ్బంది తో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని, మద్యపానం సేవించి వివాహనాలు నడపరాదని సూచించారు. మద్యపానం సేవించి దొరికిన వారి పై కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని సిఐ తెలిపారు.