తెలంగాణ కెరటం హనుమకొండ ప్రతినిధి ఫిబ్రవరి 28:
సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ వరంగల్ జిల్లా నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి అన్నారు. సమాచార హక్కు చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆర్టీఐ ఆధ్వర్యంలో మార్చి నెలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు పోస్టర్ ను బాలకిషోర్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు, సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్లిన పని చేయించుకోవడం తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టడం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని ప్రభుత్వ పనులపై సమాచారాన్ని పొందవచ్చు.ప్రభుత్వ పాలనా వ్యవస్థలో ప్రతి భారత పౌరుడు సామాజిక బాధ్యతగా అవినీతి అక్రమాలను నిరోధించడానికి పేద ప్రజలకు ఆర్టీఐ ఆవశ్యకత ఎంతో ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్రవంతి,కొమ్ము శ్రీకాంత్,అక్కెల్లి పవన్ కళ్యాణ్,ప్రవీణ్, సురేష్, మనోజ్, అరుణ్ కుమార్, సిలువేరు సురేష్, తదితరులు పాల్గొన్నారు.