Saturday , October 12 2024

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి.?

తెలంగాణ కెరటం మే 16 సూర్యాపేట జిల్లా ప్రతినిధి

మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన కొండేటి బాలకృష్ణారెడ్డి తండ్రి శంబిరెడ్డి వయస్సు (35) సంవత్సరాలు నాగార్జున సిమెంట్స్ ఫ్యాక్టరీ లో ఎలక్ట్రీషియన్ గా విధులు నిర్వహిస్తున్నారు.మంగళవారం ఉదయం 11గం సమయంలో అతను స్వగ్రామం నుండి అతని సొంత మోటార్ సైకిల్ పై డ్యూటీకి వెళ్లుచుండగా ఫ్యాక్టరీ కి అతికొద్ది దూరంలో వెనుక నుంచి ఏదో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా రోడ్డు పక్కన ఉన్న ముండ్ల పొదల్లో పడి ఉన్నాడు మట్టపల్లి నుండి మఠంపల్లి వస్తున్న బిఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు అయ్యప్ప ఇక్కడ ప్రమాదం జరిగిందని గమనించి మానవత్వం తో వెంటనే అతని దగ్గరకు వెళ్లి చూడగా అతని తలకు బలమైన గాయం కావడంతో వెంటనే అయ్యప్ప దగ్గర ఉన్న రుమాలుతో నెత్తురు కారుతున్న అతని తలకు చుట్టి వెంటనే 108 కు సమాచారం అందించారు. మృతిని భార్య లలిత ఫిర్యాదు మేరకు
మఠంపల్లి ఎస్సై రవి మాట్లాడుతూ తలకు బలమైన గాయం కావడంతో చనిపోయాడని తెలుపుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతునికి సంతానం ఒక పాప ఒక బాబు ఉన్నారని తెలిపారు.