Thursday , May 23 2024

గిరిజన బిడ్డకు న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగిస్తాం..ABVP మఖ్తల్ శాఖగిరిజన

గిరిజన బిడ్డకు న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగిస్తాం..ABVP మఖ్తల్ శాఖ

◆ స్వామి వివేకానంద చౌరస్తాలో మెడికో విద్యార్థిని ప్రీతికి నివాళి.

◆ డాక్టర్ కావాల్సిన దళిత బిడ్డను బలి తీసుకున్న ఉన్మాది సైఫ్ షఫీని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్.

◆ మహిళలలపై అఘాయిత్యాలు జరుగుతున్న స్పందించని హోం మినిస్టర్
రాజీనామా చేయాలి.

◆ ఘటనపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలి.

*గిరిజన బిడ్డకు న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగిస్తాం..ABVP మఖ్తల్ శాఖ* ◆ స్వామి వివేకానంద చౌరస్తాలో మెడికో విద్యార్థిని ప్రీతికి నివాళి. ◆ డాక్టర్ కావాల్సిన దళిత బిడ్డను బలి తీసుకున్న ఉన్మాది సైఫ్ షఫీని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్. ◆ మహిళలలపై అఘాయిత్యాలు జరుగుతున్న స్పందించని హోం మినిస్టర్ రాజీనామా చేయాలి. ◆ ఘటనపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలి. తెలంగాణ రాష్ట్రంలో యువతులకు రక్షణ కరువైందని అడుగడుగునా వేధింపులు తాళలేక ఆత్మాభిమానం చంపుకోలేక ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు ఏబీవీపీ నగర కార్యదర్శి వంశీ. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న ప్రీతి నాయక్ అనే విద్యార్థిని అదే యూనివర్సిటీకీ చెందిన సైఫ్ షఫీ అనే సీనియర్ వేధింపులు తాళలేక ఫిబ్రవరి 21న ఆత్మహత్యకు పాల్పడి ఐదు రోజులు చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మరణించిన ప్రీతి నాయక్ మృతి పట్ల స్వామి వివేకానంద చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి వంశీ మాట్లాడుతూ రాష్ట్రంలో యువతులకు మహిళలకు భద్రత కరువైందని సైఫ్ షఫీ లాంటి ఉన్మాదులు ప్రతి కళాశాలలో ఉన్నారని అలాంటి వారందరికి గుణపాఠం చెప్పేలా సైఫ్ షఫీకీ బహిరంగంగా ఉరి తీయాలని ఏబీవీపీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. డాక్టర్ గా సమాజానికి సేవలందించాల్సిన దళిత బిడ్డను బలి తీసుకున్న సైఫ్ షఫీని ఆ సంఘటనలో అలసత్వం ప్రదర్శించిన యూనివర్సిటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. యూనివర్సిటీ కళాశాలలో విస్తరిస్తున్న పబ్ కల్చర్ , విదేశీ సంస్కృతి వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని వాటిని కట్టడి చేయడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇటీవల మహిళలపై అనేక దాడులు అత్యాచారాలు జరుగుతున్న హోం మంత్రి స్పదించకపోవడం దారుణమని అన్నారు.ఇకనైనా రాష్ట్రప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కేవలం నష్టపరిహారంతో సర్ది చెప్పకుండా నిందితుడికి కఠిన శిక్షను విధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే విద్యార్థినులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండాలని అలాంటి ఆకతాయిలకు బుద్దిచెప్పడంలో ఏబీవీపీ మీకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినయ్ , ఉపాధ్యక్షుడు వినయ్ , శరణ్ , సురేష్ , నితిన్ , పారామెడికల్ విద్యార్థినిలు పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో యువతులకు రక్షణ కరువైందని అడుగడుగునా వేధింపులు తాళలేక ఆత్మాభిమానం చంపుకోలేక ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు ఏబీవీపీ నగర కార్యదర్శి వంశీ.
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న ప్రీతి నాయక్ అనే విద్యార్థిని అదే యూనివర్సిటీకీ చెందిన సైఫ్ షఫీ అనే సీనియర్ వేధింపులు తాళలేక ఫిబ్రవరి 21న ఆత్మహత్యకు పాల్పడి ఐదు రోజులు చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మరణించిన ప్రీతి నాయక్ మృతి పట్ల స్వామి వివేకానంద చౌరస్తాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి వంశీ మాట్లాడుతూ రాష్ట్రంలో యువతులకు మహిళలకు భద్రత కరువైందని సైఫ్ షఫీ లాంటి ఉన్మాదులు ప్రతి కళాశాలలో ఉన్నారని అలాంటి వారందరికి గుణపాఠం చెప్పేలా సైఫ్ షఫీకీ బహిరంగంగా ఉరి తీయాలని ఏబీవీపీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. డాక్టర్ గా సమాజానికి సేవలందించాల్సిన దళిత బిడ్డను బలి తీసుకున్న సైఫ్ షఫీని ఆ సంఘటనలో అలసత్వం ప్రదర్శించిన యూనివర్సిటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. యూనివర్సిటీ కళాశాలలో విస్తరిస్తున్న పబ్ కల్చర్ , విదేశీ సంస్కృతి వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని వాటిని కట్టడి చేయడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
ఇటీవల మహిళలపై అనేక దాడులు అత్యాచారాలు జరుగుతున్న హోం మంత్రి స్పదించకపోవడం దారుణమని అన్నారు.ఇకనైనా రాష్ట్రప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కేవలం నష్టపరిహారంతో సర్ది చెప్పకుండా నిందితుడికి కఠిన శిక్షను విధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే విద్యార్థినులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండాలని అలాంటి ఆకతాయిలకు బుద్దిచెప్పడంలో ఏబీవీపీ మీకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినయ్ , ఉపాధ్యక్షుడు వినయ్ , శరణ్ , సురేష్ , నితిన్ , పారామెడికల్ విద్యార్థినిలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *