Wednesday , July 24 2024

సిఐ సైదులు కు శుభాకాంక్షలు తెలియజేసిన కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి

(తెలంగాణ కెరటం) ఘట్ కేసర్ ప్రతినిధి/మార్చి 11: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ కు నూతనంగా పదవీభావ దినోత్సవ స్వీకరించిన హౌస్ ఆఫీసర్ సైదులు ను ఎన్ఎఫ్సీ నగర్ ఎస్ఐ శేఖర్ ఆధ్వర్యంలో ఘట్కేసర్ మున్సిపల్ రెండో వార్డ్ కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మైపాల్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేసినారు. సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ఘట్కేసర్ లో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అన్ని పార్టీల వారిని కలుపుకొని చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి వారికి తగిన న్యాయం చేకూర్చాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యురాలు విమల వడ్లకొండ శివయ్య, 2వ వార్డ్ బి ఆర్ఎస్ పార్టి ప్రెసిడెంట్ జనగామ యాదగిరిరావు, 2 వ వార్డు మున్సిపల్ జనరల్ సెక్రెటరీ శివ, ఆంజనేయులు గౌడ్ మర్యాద పూర్వకంగా కలసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలుతెలియజేశారు.