(తెలంగాణ కెరటం) ఘట్ కేసర్ ప్రతినిధి : ఏప్రిల్ 13 :
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ని పట్నం సునీత మహేందర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధిలో తోడ్పడాలని అన్నారు. శనివారం సాయంత్రం 5గంటలకు చౌదరిగుడా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కట్ట ఆంజనేయులు నివాస ప్రాంగణంలో మండల పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్నం సునీత మహేందర్ రెడ్డి, కుమారుడు రితీష్ రెడ్డి, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు గాని కార్యకర్తలు గాని ఎలాంటి విభేదాలకు పోకుండా పార్టీలోకి కొత్తగా చేరుతున్న వారిని కలుపుకొని రానున్న 30 రోజులు సమన్వయం పాటించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అమలుపరుస్తున్న ఆరు గ్యారెంటీ ల గురించి ఇంటింటికి గడపగడపకు తిరిగి ప్రజలకు తెలియజేసీ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, గెలుపుకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మన అభ్యర్థి ని గెలిపించుకుంటే తెలంగాణలోనే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఒక కన్ను కొడంగల్ నియోజకవర్గం అయితే, మరో కన్ను మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం అని అన్నారు. తెలంగాణ అంతా డబల్ ధమాకా ఉంటే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి త్రిబుల్ ధమాకా ఉంటుందని అన్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండే ఎంపీగా గెలిచి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు సమన్వయం పాటించి మన అభ్యర్థి గెలుపుకై కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌదర్ గూడా ఎంపీటీసీ పులకంటి భాస్కర్ రెడ్డి, చౌదరిగుడా మాజీ సర్పంచ్ నక్క నరసింహ గౌడ్, పలు గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.