అనారోగ్యం పాలవుతున్న చిన్నారులు, గర్భిణీ స్త్రీలు..
అధికారుల నిర్లక్ష్యం పై మండిపడ్డ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి..
(తెలంగాణ కెరటం) ఘట్ కేసర్ ప్రతినిధి/ మార్చి 11: అంగన్వాడి ప్రాంగణంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ మురికి నీరు వల్ల చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ఎంపిటిసి పులకట్టి భాస్కర్ రెడ్డి, ఈ సందర్భంగా ఆయన ఘట్కేసర్ మండలం చౌదరిగుడా గ్రామపంచాయతీ పరిధి మక్త గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో మీడియా సమక్షంలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం సరి గా లేక డ్రైనేజీ మురికి నీరంతా అంగన్వాడి ప్రాంగణంలో నిల్వ చేరి కుంటలను తలపిస్తున్నాయని బోరు నుండి వచ్చే నీరు కూడా కాలుష్యుతమై చిన్నారులకు అన్నం వండి పెడదామన్నా మంచినీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 20 మంది అంగన్వాడి పిల్లలు మరియు 80 మంది గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఈ అంగన్వాడి కేంద్రానికి వస్తూ ఉంటారని కనీసం అడుగు కూడా పెట్టలేని స్థితిలో అంగన్వాడి ప్రాంగణమంతా డ్రైనేజీ మురికి నీరుతో నిండిపోయి దుర్వాసనతో ఊపిరి కూడా పీల్చలేని పరిస్థితి ఉందన్నారు. అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ వల్ల దోమలు తీవ్రం కావడంతో చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు రోగాల బారినపడుతున్నారని అన్నారు. అంగన్వాడి కేంద్రం పక్కనే డ్వాక్రా మహిళా భవనం కూడా ఉండడంతో డ్రైనేజీ మురికి నీరు నిల్వ ఉండడంతో వారు కూడా డ్వాక్రా భహనం లోపలికి వెళ్లలేని పరిస్థితిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకువెళ్లి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మాత్రం చోద్యం చూస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించకుంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తానని హెచ్చరించారు ఎంపీటీసీ పులకంటి భాస్కర్ రెడ్డి.