Sunday , May 26 2024

ఘట్ కేసర్ మున్సిపాలిటీ ప్రజా ఆశీర్వాదసభలో భారీగా హాజరైన ప్రజలు ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ

(తెలంగాణ కెరటం) ఘట్ కేసర్ ప్రతినిధి / నవంబర్ 5 :

తెలంగాణలో సంపద సృష్టించాలన్న తెలంగాణ అభివృద్ధి చెందాలన్న ప్రజా సంక్షేమం కొరకు సంక్షేమ పథకాలు రావాలన్న ఒక సీఎం కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపల్ గురుకుల్ కళాశాల కరీం గూడా చౌరస్తా వద్ద మేడ్చల్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద సభ కు ముఖ్య అతిధిగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, మేడ్చల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి, మాట్లాడుతూ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని అభివృద్ధి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా చేశారని భారతదేశంలోని రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడితే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుందని అన్నారు. మల్ల బి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ 2000 వేల రూపాయల పింఛన్ ను విడతలవారీగా 5 వేలకు పెంచబోతున్నాడని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం 1200 వందల రూపాయలకు ఇస్తున్న వంట గ్యాస్ ను, బి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 400 వందల రూపాయలకే ఇస్తారని, ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల నుండి 15 లక్షల రూపాయల వరకు పెంచబోతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ముఖ్యంగా పేదలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్, దివ్యాంగుల పెన్షన్, వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలవుతున్న సంక్షేమ పథకాలే సీఎం కేసీఆర్ ను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించి మూడోసారి సీఎం నీ చేస్తారని ధీమావ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర జంగయ్య యాదవ్ పాసిపోయిన ముఖాలు వేసుకొని మల్లారెడ్డిని ఓడించాలని ప్రజల్లో తిరుగుతున్నారని వారి లక్ష్యం మల్లారెడ్డిని ఓడించడమే తప్ప అభివృద్ధి చేయాలనే లక్ష్యమే లేదని వారికి మల్లన్న అంటే ఏందో సినిమా చూపిస్తానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మేడ్చల్ నుండి ఎంపీగా గెలిచి నాలుగు సంవత్సరాలు అయితున్నప్పటికీ చేసింది ఏమీ లేదని పొరపాటున వారికి ఓటు వేసి ఆగం కావద్దని అన్నారు. తెలంగాణలో సంపదను సృష్టించి అభివృద్ధి చేసే దమ్ము పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే దమ్ము సీఎం కేసీఆర్ కు తప్ప మరెవ్వరికీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని దేశంలోనే నెంబర్ వన్ సీఎం కేసీఆర్ అయితే రాష్ట్రంలోనే నెంబర్ వన్ మంత్రి మల్లారెడ్డి అని తెలంగాణ ప్రజలంతా కూడా కారు గుర్తుకు ఓటు వేసి చామకూర మల్లారెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ ను మూడోసారి సీఎం గా చేసి తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర మద్రారెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.