తెలంగాణ కెరటం, బచ్చన్నపేట ప్రతినిధి, ఆగష్టు6
బచ్చన్నపేట మండల పరిషత్ ఆఫీస్ వద్ద గత 32 రోజులుగా గ్రామపంచాయతీ సిబ్బంది చేస్తున్న సమ్మెకు మండల సర్వసభ్య సమావేశానికి హజరైన ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని ఆదివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలి,కారోబార్ ,బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలి, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.