Sunday , May 26 2024

గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలి

మండల పరిషత్ ప్రతిపక్ష నేత మహమ్మద్ మసూద్

తెలంగాణ కెరటం, బచ్చన్నపేట ప్రతినిధి, ఆగస్టు6

బచ్చన్నపేట మండల పరిషత్ ఆఫీస్ వద్ద గత 32 రోజులుగా గ్రామపంచాయతీ  సిబ్బంది చేస్తున్న సమ్మెకు  ఆలింపూర్ ఎంపీటీసీ మండల పరిషత్ ప్రతిపక్ష నేత మహమ్మద్ మసూద్ మరియు బచ్చన్నపేట ఎంపీటీసీలు  నల్లగొని పుష్ప బాలకిషన్ గౌడ్, అల్వాల రాధా ఎల్లయ్యలు మద్దతు తెలిపారు మసూద్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బంది అందర్నీ పర్మినెంట్  చేయాలని ఈరోజు జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయించడం జరిగిందన్నారు పంచాయతీ కార్మికుల కు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలి,కారోబార్ ,బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలి, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారూ  వీరితోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్లగొండ బాలకిషన్ గౌడ్ ,మండల ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య లు పాల్గొన్నారు.