Thursday , May 23 2024

గరం గరంగా మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి పాలక మండలి సభ్యుల సమావేశం

చైర్మన్ తీరుపై మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం?

మఠంపల్లి జూన్ 05 సూర్యాపేట జిల్లా ప్రతినిధి

లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మట్టపల్లి మహా క్షేత్రం నందు సోమవారం పాలకమండలి సభ్యుల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో అనువంశిక ధర్మకర్తల పై పాలక మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.దేవస్థానం యొక్క అభివృద్ధి భక్తులకు అసౌకర్యం కలిగించే విషయంపై చర్చించి పలు సూచనలు చేసినట్లు తెలిసింది.పాలకమండలి సమావేశంలో భక్తుల సౌకర్యార్థం దేవాలయం నందు భక్తులు స్నానమాచరించుట విషయంలో ఓపెన్ గా ఉన్న సేవర్స్ ముందర బైసన్ బోర్డు ఏర్పాటు చేసి సేవర్స్ పక్కన గార్డెన్ ఏర్పాటు చేయాలని,హుజూర్నగర్ మట్టపల్లి రోడ్డు నందు ఒక సూచిక బోర్డు మరియు మట్టపల్లి వై జంక్షన్ రోడ్డు నందు ఒక సూచిక బోర్డు హుజూర్నగర్ నుండి దేవస్థానం వరకు మూడు సైన్ బోర్డ్స్, దేవాలయ నిత్య అన్నదానం నందు భక్తుల సౌకర్యార్థం ఉచిత భోజన పరిమితి పెంచుట పలు అంశాల పై సమిష్టిగా చర్చించి తీర్మానించినారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ విజయ్ కుమార్ పాలకమండలి సభ్యులు వెంకటనారాయణ,రామయ్య,కొండల్ రెడ్డి,శశి రెడ్డి,ఆలీ,రామకృష్ణ,శ్రీనివాస్ రెడ్డి,నరసింహ,వెంకటేశ్వర్లు,ఎక్స్ అఫీషియో నెంబర్ తూమాటి శ్రీనివాసాచార్యులు,కార్యనిర్వహణాధికారి సిరికొండ నవీన్ పాల్గొన్నారు.