Wednesday , September 18 2024

గరంగరంగా మండల సర్వసభ్య సమావేశం

తెలంగాణ కెరటం ,బచ్చన్నపేట ప్రతినిధి, ఆగస్టు6

సర్పంచుల చేసిన పనులకు బిల్లులు సంవత్సరాలుగా పెండింగ్ విద్యుత్ శాఖ లైన్ మేన్ కనకసేన పై చర్యలు తీసుకొవాలి.ఈజిస్,విద్యుత్ అధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం బచ్చన్నపేట మండల సర్యసభ్య సమావేశం గరంగరంగా సాగింది.ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భావండ్ల నాగజ్యోతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈజీఎస్,విద్యుత్ అధికారులపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.మండల సర్వ సభ్య సమావేశానికి ప్రారంభానికి ముందు ఎంపిపి భావండ్ల నాగజ్యోతి ఆద్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పోఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలును నిర్వహించారు.సర్పంచులు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వారి గ్రామాలలో క్రిడా ప్రాంగణాలు, స్మశానవాటికలు ఎస్టిమేట్ ప్రకారం నిర్మామణ చేసి సంవత్సరాలు  గడిచిన ముడు మండల సర్వసభ్య సమావేశాలలో తీర్మానాలు చేసిన ఫలితాలు లేకపోవడం అప్పులు తెచ్చి మరి పనులు చేసిన ఇంతవరకు బిల్లులు రావడం లేదని ఈజిస్ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే తమకు బిల్లులు రావడం లేదన ప్రజాప్రతినిధులు ఈజిస్ అధికారుల పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతి గ్రామంలో జరిగిన పనుల పై బిల్లులు విషయంలో ప్రజాప్రతినిధులు పిడితో పాటు కలెక్టర్ కు పిర్యాదు చేసిన ఈజిస్ అధికారులపై విచారణ చేపట్టాలని తీర్మానం చేసినట్లు తెలిపారు ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ల కారణంగా తమకు బిల్లు రావడం లేదని ఆరోపణలు చేశారు.వారి పై శాఖ పరమైన చర్యలు తిసుకోవాలి అన్నారు.మండలంలోని పలు గ్రామాలలో రేషన్ డిలర్లు మరణించడంతో బియ్యం అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.వారి స్థానంలో కొత్త రేషన్ డిలర్లలను నియమించాలని ప్రజాప్రతినిధులు కొరారు.విద్యుత్ శాఖ అధికారు ప్రజాప్రతినిధులతో అనుసంధానంతో వ్యవహరించాలని తెలిపారు.ముఖ్యంగా ఇటుకాలపల్లి ,రామచంద్రాపురం గ్రామాల విద్యుత్ శాఖ లైన్ మేన్ కనకసేన ప్రజాప్రతినిధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఉన్నత అధికారులకు పిర్యాదు చేయడంతో పాటు అతనిపై చర్యలు తీసుకొవాలి అని కొరారు.ఇటీవల వర్షాల కారణంగా పలు గ్రామాలలో చెరువు నిండి చెరువుకట్టలు గండి పడినప్పుడు ప్రజాప్రతినిధులు స్వంత ఖర్చులతో  గండి పూడుస్తున్నారు కాని ఇరిగేషన్ శాఖ నామమాత్రంగా  వీధులు నిర్వహిస్తున్నారు అని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.పలు గ్రామాలలో అంగనవాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగవాడి,ఆయాల పోస్టులు భర్తీ చేసి బసిరెడ్డిపల్లి,విఎస్అర్ నగర్ గ్రామాలలో ఖాళి పోస్టుల అక్కడి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ మార్చాలని తెలిపారు.మండలంలో పలు గ్రామాలకు ఆర్టిసు బస్సుల సర్వీసులు తిరిగి పునరుద్ధరణ చేయాలని ప్రజాప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిడివో రఘురామకృష్ణ,  సర్పంచులు, ఎంపీటీసీలు,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.