Monday , September 16 2024

ఘనంగా జరిగిన గిరిజన శతాబ్ది ఉత్సవాలు :

ఘనంగా జరిగిన గిరిజన శతాబ్ది ఉత్సవాలు :-
తెలంగాణ కెరటం ఉమ్మడి వెల్దుర్తి మండల ప్రతినిధి:- శనివారం మాసాయిపేట మండలం పరిధిలోని రామంతపూర్ తండాలో 25 లక్షల రూపాయలతో ప్రభుత్వ పాఠశాల భవనము మరియు 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనము రామంతపూర్ మరియు బొమ్మరంలో అలాగే 10 లక్షల రూపాయల తో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన నర్సాపూర్ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి మరియు మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గిరిజనుల సంక్షేమం కోసం వడ్డీ లేని రుణాలు అటువంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, జిల్లా కోపరేటివ్ సభ్యులు మున్నూరు అహ్మద్ ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జడ్పిటిసి రమేష్ గౌడ్, బొమ్మరం సర్పంచ్, మాసాయిపేట్ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీలు మరియు బి ఆర్ ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.