Wednesday , July 24 2024

గంజాయి పట్టివేత వ్యక్తి

గంజాయి పట్టివేత వ్యక్తి అరెస్టు

తెలంగాణ కెరటం ఆర్మూర్ మే 10:

ఆర్మూర్ పట్టణం లో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పోచంపాడు వద్ద ముందస్తు సమాచారం మేరకు అనుమానాస్పదంగా ఉన్నటువంటి దేవిదాస్ తండ్రి నాగోరావు నివాసం దాబా (కే) మండలం ఇచ్చోడ అదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి వద్ద 300 గ్రాముల గంజాయి బ్యాగునందు లభించింది. ఇట్టి గంజాయిని తాను అదిలాబాద్ పరిసర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ విక్రయించుచున్నానని తెలియపరచగా అతన్ని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగింది. ఈ రైడ్ లో సబ్ ఇన్స్పెక్టర్స్ ఏ. గంగాధర్, ప్రమోద్ చైతన్య, చంద్రమౌళి మరియు హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ గౌడ్ కానిస్టేబుల్స్ సాయిబాబా గౌడ్, దేవదాస్, సందీప్ పాల్గొన్నారని ఆర్మూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్ ఒక ప్రకటనలో తెలియజేశారు.