Sunday , May 26 2024

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు 

తెలంగాణ కెరటం హుజురాబాద్ ప్రతినిధి ఆగస్టు 6:

శ్రీ విఘ్నేశ్వర ఆర్ఎంపి పి.ఎం.పి అసోసియేషన్ హుజురాబాద్ మండలం ఆర్ఎంపీ లు తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ సార్ 90వ, జయంతి వేడుకలు శ్రీ విఘ్నేశ్వర ఆర్ఎంపి పి.ఎం.పి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా… వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జయ శంకర్ (ఆగష్టు 6, 1934 – జూన్ 21, 2011) హనుమకొండ జిల్లా,ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామ శివారు అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ 2011 జూన్ 21న, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు. తెలంగాణ ఉద్యమ సూర్యుడు జయశంకర్ సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని శ్రీ విఘ్నేశ్వర ఆర్.ఎం.పి & పి.ఎం.పి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చిలుక మారి శ్రీనివాస్ గారు ఉపాధ్యక్షులు తిరుపతి గారు ఎర్రోళ్ల సదానందం గారు జాయింట్ సెక్రెటరీ రామరాజు గారు ట్రెజరర్ కమల్ సింగ్ గారు చీఫ్ అడ్వైజర్స్ కృష్ణమూర్తి గారు ధనుంజయ గారు ఆర్గనైజర్ సెక్రెటరీ పరమేష్ గారు గొల్లపల్లి రమణ చారి గారు స్కూటీ మెంబర్స్ రమేష్ రాజు జగదీష్ జగదీష్ జగదీష్ మరియు సంఘ సభ్యులు పాల్