Thursday , May 23 2024

ఘనంగా జరిగిన కుమ్మరుల ఆత్మగౌరవ సభ.

డైరెక్టర్ ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ _ ఆడాల గణేష్ కుమ్మర

తెలంగాణ కెరటం, ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 26

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని యాచారం మండల కేంద్రంలో కవయిత్రి కుమ్మర మెల్ల విగ్రహావిష్కరణ చేశారు అన్ని గ్రామాల కుమ్మరులు ఈ ఆత్మ గౌరవ సభకు హాజరయ్యారు తాత ముత్తాతల కాలం నుంచి అనేక సమస్యలతో సతమతమవుతున్న కుమ్మర స్థితిగతులు ఇప్పటికీ మారలేదు నిజాం పరిపాలన కాలంలో ప్రతి గ్రామంలో కుమ్మరులకు కుండలు చేసుకోవడానికి వీలుగా వారి అవసరాలకు ఒక ఎకరం భూమి ఉండాలని కుండలు తయారీకి ఉపయోగపడే మట్టి గ్రామంలో ప్రభుత్వ భూములు ఎక్కడ దొరికినా మట్టిని తీసుకువచ్చి కుండలు కాల్చడానికి ఉపయోగించే కంప ముళ్ళపోదలు పెంచడానికి వీలుగా గ్రామంలో కుమ్మరుల కు అందజేయాలన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా కుమ్మరుల భవిష్యత్ మారుతుందని తెలంగాణ ఉద్యమ కాలంలో మా జాతి ప్రథమ పాత్ర ఉంది అన్నారు ప్లాస్టిక్ బిందె స్టీల్ బిందెలను తయారు చేసేవాడు తమవస్తులకు తామే ఖరీదు నిర్ణయం చేసుకుంటాడు కానీ కుమ్మరి కుండకు మాత్రం ఎవరు ఖరీదు నిర్వహించారు ఎందుకు ఈ వివక్ష మేము ఏ రిజిస్ట్రేషన్ ప్రతిపాదికను ఉపయోగించాలి మహా హక్కులు మాకు కావాలి అంటూ డిమాండ్ చేశారు
కుమ్మరులను బీసీ – బీ నుండి బీసీ -ఏ లో చేర్చాలి
_ కుమ్మరులను చిత్ర కళాకారులు గా గుర్తించాలి కుమ్మరులను వృత్తి కార్మికులు గా గుర్తించి 50 సంవత్సరాలు పైబడిన వారికి 5000 పెన్షన్ మంజూరు చేయాలి. కుమ్మరులను గ్రామ దేవతల ఆలయాల వద్ద పూజారులుగా గుర్తించి నెలకు గౌరవ వేతన ఇవ్వాలి _
కుమారులకు ఫెడరేషన్ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలి. ప్రతి మండలంలో కుమ్మర్ల సంక్షేమ భవనానికి 1000 గజాల స్థలాన్ని కేటాయించాలి అంటూ డిమాండ్ చేశారు కుమ్మరుల ఆత్మగౌరవ సభ ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆడాల గణేష్ ఆధ్వర్యంలో ఈ సభ ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లా బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి , జడ్పిటిసి చిన్నోళ జంగమ్మ యాదయ్య, ఎంపీపీ కొప్పు సుకన్య భాష, నడికుడి జయంత్ రావు కుమ్మర రాష్ట్ర కమిటీ నాయకులు , సర్కిల్ ఇన్ స్పెక్టర్ లింగయ్య, కొండాపురం నాగరాజు, కొండాపురం శ్రీశైలం, తదితరులు హాజరయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *