Sunday , May 26 2024

ఘనంగా డాన్ బాస్కో పాఠశాలలో వార్షికోత్సవాలు

ఘనంగా డాన్ బాస్కో పాఠశాలలో వార్షికోత్సవాలు…

తెలంగాణ కెరటం మార్చి 5 నర్సాపూర్ ప్రతినిధి: నర్సాపూర్ పట్టణంలోని డాన్ బాస్కో పాఠశాలలోశుక్రవారం రాత్రి డాన్ బాస్కో పాఠశాల డైరెక్టర్ నర్సిరెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యేమదన్ రెడ్డి మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతరెడ్డిలు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరవ్వగా పాఠశాల డైరెక్టర్ నర్సిరెడ్డి కరస్పాండెంట్ యశ్వంత్ రెడ్డి హాజరయ్యారు ఎమ్మెల్యేమదన్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత రెడ్డి మాట్లాడుతూ మహనీయుల ఆశయాలు ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు వారి బాటలో నడవాలని అన్నారు చెడు వ్యసనాల బారిన పడకుండా మంచి అలవాటులతో ఉండి చదువుపై శ్రద్ధ వహించి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ మాట్లాడుతు డాన్ బాస్కో స్కూల్లో మంచి విద్యాబోధన జరుగుతుందని పాఠశాల యజమాన్యం నిరుపేద పిల్లలకు ఫీజుల్లో కొంత రాయితీ కల్పించాలని కోరారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ నర్సిరెడ్డి మాట్లాడుతూ ఎవరైనా తల్లిదండ్రులు లేని అనాదలైన పిల్లలకు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉచితంగా భోదన అందిస్తామన్నారు ఎమ్మెల్యే మహిళా కమిషన్ చైర్ పర్సన్ మున్సిపల్ చైర్మన్లు నర్సిరెడ్డిని అభినందించారు అనంతరం పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా విద్యార్థులు సంస్కృత కార్యక్రమాలను నిర్వహించారు విద్యార్థులు చేసిన డాన్సులు పలువురిని అలరించాయి ఈ కార్యక్రమంలో డాన్ బాస్కో స్కూల్ డైరెక్టర్ నర్సిరెడ్డి తో పాటు కరస్పాండెంట్ యశ్వంత్ రెడ్డి ప్రిన్సిపాల్ మేఘన ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

2 comments

  1. Hello my family member! I wish to say that this post is amazing, great written and come with almost all important infos.

    I would like to look extra posts like this .

  2. Fantastic blog you have here but I was curious about if you
    knew of any forums that cover the same topics discussed here?
    I’d really like to be a part of online community where I can get opinions from other knowledgeable individuals that share
    the same interest. If you have any recommendations, please let me know.
    Cheers!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *