Monday , July 22 2024

జయప్రకాష్ నారాయణ ను కలిసిన గుడాల శేఖర్ గుప్తా

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి జనవరి

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో మాట మంతీ మోహన రాగం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం గురువారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయ ప్రకాష్ నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా జయప్రకాష్ నారాయణ ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా శేఖర్ గుప్తా మాట్లాడుతూ జయప్రకాష్ నారాయణ ఆత్మీయంగా మాట్లాడారని,మంచి రాజకీయ విశ్లేషకుడు రాజకీయ అనుభవం కలిగిన జయప్రకాష్ నారాయణ చెప్పే మాటలు అనుసరణీయం అని, యువత రాజకీయాల్లోకి రావాలని బలంగా నమ్మే వ్యక్తి జయప్రకాష్ నారాయణ అని అన్నారు.