Wednesday , July 24 2024

కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయుటకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ కెరటం గజ్వేల్:01 మార్చి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి నందు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడం కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సాయి కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గజ్వేల్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిఎన్ఎం పూర్తిచేసి ఐదు సంవత్సరాల అనుభవం లేదా హెచ్ఐవి/ ఎయిడ్స్ ఫీల్డ్ నందు ఒక సంవత్సరం అనుభవం కలిగి బీఎస్సీ నర్సింగ్ కంప్యూటర్ పరిజ్ఞానం గల వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు 15 రోజులలో మెడికల్ సూపరింటెండెంట్ ప్రాంతీయ ఆసుపత్రి గజ్వేల్ నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థుల యొక్క అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని సూపరింటెండెంట్ డా.సాయి కిరణ్ కోరారు.