Thursday , May 23 2024

ఇరవై అయిదు వసంతాలకు కలుసుకున్న విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ కెరటం ప్రతినిధి మే:-29

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లోని శ్రీ వెంకటరమణ ఉన్నత పాఠశాల
లో 1996-97లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం రోజున హరిహర ఫంక్షన్ హాల్ నందు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిర్వహించారు ఈ కార్యక్రమానికి చదువు నేర్పిన గురువులు ముఖ్య అతిథులు గా హాజరయ్యారు ముందుగా పాఠశాల వ్యవస్థాపకులు కీశే- చిలుముల కుమారస్వామి
చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషములు మౌనం పాటించి ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని ప్రారంభించారు
పూర్వ ఉపాధ్యాయులు విద్యార్థులు ఒకే వేదిక వద్ద కలుసుకొని విద్యార్థులందరు ఆత్మీయ పలకరింపులు కలయికల కోలహాలాల తో
వేదిక పండుగ వాతావరణం సంతరించుకుంది
విద్యార్థులు అందరూ కలిసి
ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులకు పాఠశాల చిహ్నం గల మెమెంటో లు బహుకరించి అభినందనలు తెలియజేసారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు యెల్ల పోచెట్టి,పారువెళ్ల శ్రీనివాస్, శివ కుమార్, సాంబశివుడు, నరహరి శర్మ, రంగారావు పాఠశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు