Tuesday , July 16 2024

ఇంటి స్థలం విషయంలో ఘర్షణ

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి జనవరి

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో ఇంటి స్థలం ఘర్షణ పై పలువురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు మర్కుక్ మండల ఎస్సై శంకర్ తెలిపారు. వారు తెలిపిన ప్రకారం చేబర్తి గ్రామానికి చెందిన లింగని రవీందర్, మాజీ సర్పంచ్ జమున అర్జున్ సింగ్ ల మధ్య దశాబ్దాల నుంచి భూమి సమస్య ఉంది. ఇందులో రవీందర్ కుటుంబ సభ్యులు కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. భూమి రవందర్ కే చెందుతుందని అర్జున్ సింగ్ కుమారులు మరికొంతమందితో కలిసి మంగళవారం జెసిబి తో ఆ భూమిని చదును లెవెల్ చేశారు. ఈ క్రమంలో లింగని రవీందర్,అర్జున్ సింగ్ ల కుమారుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో రవీందర్ తో పాటు అతని కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషిస్తూ గాయపరిచారని,రవీందర్ ఇచ్చిన ఫిర్యాదుతో అర్జున్ సింగ్ కుమారుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేసు నమోదు చేసినట్లు, అర్జున్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో రవీందర్ పై కేసు నమోదు చేశామని, బుధవారం గజ్వేల్ ఏసీపి రమేష్, ఎస్ఐ శంకర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో విచారణ నిమిత్తం చేబర్తి గ్రామంలో పర్యటించి విరాళాలు సేకరించారు. వారితోపాటు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.