సీఐటీయూ డిమాండ్
తెలంగాణ కెరటం, ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 20
తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న మూడు నెలల వేతనాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి,సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాజు , యూనియన్ జిల్లా కార్యదర్శి కవిత, అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, సీఐటీయూ ఉపాధ్యక్షులు బ్రహ్మయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు పోచమోని కృష్ణ, సి హెచ్ ఎల్లేష్, అంగన్వాడీ యూనియన్ జిల్లా కోశాధికారి లక్ష్మీ జిల్లా ఉపాధ్యక్షురాలు నాగమణి,జిల్లా నాయకులు వైదేవి, బేబీ బాలమణి ,జయమ్మ, యాదమ్మ, లక్ష్మి, జ్యోతి, సుకన్యల తోపాటు 600 మంది అంగన్వాడీలు పాల్గొన్నారు.